ప్రొడక్షన్ లో ‘మహానాయకుడు’.. పోస్ట్ ప్రొడక్షన్ లో ‘కథానాయకుడు’ !

Published on Dec 7, 2018 4:00 am IST

బాలయ్య తెలంగాణలోని ఎన్నికల ప్రచారం కోసం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ షూటింగ్ నుండి కొన్ని రోజులు విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దర్శకుడు క్రిష్ మాత్రం ఈ లోపు బయోపిక్ సెకెండ్ పార్ట్ కు సంబంధించిన ముఖ్యమైన కొన్ని సీన్స్ ను ఇతర తారాగణం పై షూట్ చేశారట. ఇక బాలకృష్ణ ప్రచారం కూడా ముగియడంతో తిరిగి షూట్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో బాలయ్య పై సెకెండ్ పార్ట్ లోని కొన్ని రాజకీయాలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

కాగా మరో పక్క మొదటి పార్ట్ పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇప్పటికే ముఖ్యమైన పాత్రలలు సంబధించి డబ్బింగ్ కూడా చాలావరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More