వైరల్ అవుతోన్న ఎన్టీఆర్ లేటెస్ట్ స్టైలిష్ స్టిల్స్!

Published on May 26, 2023 6:02 pm IST

గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన కొత్త సినిమా దేవర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. షూటింగ్‌ని త్వరగా ముగించి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సాయంత్రం ఎన్టీఆర్ యొక్క కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.

ఈ స్టిల్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. డిఫెరెంట్ మూడ్‌లలో హీరో కనిపించారు. అయితే ఇన్‌స్టంట్ దృష్టిని ఆకర్షించిన చిత్రం మాత్రం ఎన్టీఆర్ కాలర్ పట్టుకున్నది. ఈ చిత్రంలో తన యాటిట్యూడ్ తో పీక్స్ లో ఉంది. ఫ్యాన్స్ ఈ స్టిల్స్ తో ఫిదా అయిపోయారు. అడ్వర్టైజ్‌మెంట్ షూట్ పూర్తయిన తర్వాత ఈ చిత్రాలు తీయబడ్డాయి. దేవరతో పాటు, ఎన్టీఆర్‌కి వార్ 2 మరియు ఎన్టీఆర్ 31 లు లైన్ లో ఉన్నాయి, వీటిని వరుసగా అయాన్ ముఖర్జీ మరియు ప్రశాంత్ నీల్ లు దర్శకత్వం వహించనున్నారు.

సంబంధిత సమాచారం :