అఫీషియల్ : ‘మంగళవారం’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

అఫీషియల్ : ‘మంగళవారం’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Dec 23, 2023 11:06 PM IST


పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో అజ్మల్, అజయ్ ఘోష్, చైతన్య కృష్ణ, దివ్య పిళ్ళై వంటి వారు ఇతర కీలక పాత్రల్లో రూపొందిన లేటెస్ట్ మూవీ మంగళవారం. ఆర్ ఎక్స్ 100 మూవీ ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ మూవీలో సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

స్వాతిరెడ్డి గునుపాటి, ఎం సురేష్ వర్మ కలిసి సంయుక్తంగా ఈ మూవీని మధుర మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ సంస్థల పై గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. విషయం ఏమిటంటే, ఇక ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కోసం గుడ్ న్యూస్ రానే వచ్చింది. కాగా ఈ మూవీ డిసెంబర్ 26న ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుందని కొద్దిసేపటి క్రితం అఫీషియల్ ప్రకటన వచ్చింది. మరి ఈ మూవీ ఓటిటి ఆడియన్స్ ని ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు