తగ్గేదేలే..”పుష్ప” రాజ్ వెనకడుగు లేదు అనుకున్న డేట్ కే.!

Published on Oct 2, 2021 9:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప ది రైజ్”. బన్నీ సుకుమార్ ల నుంచి వస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది కావడంతో మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి.

అయితే ఇదిలా ఉండగా ఈ సినిమాని మేకర్స్ ఎప్పుడో క్రిస్మస్ రేస్ కి రిలీజ్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు. కానీ రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ పై సరికొత్త ఊహాగానాలు స్టార్ట్ కాగా మేకర్స్ మాత్రం దానికి వెంటనే చెక్ పెట్టేసారు. రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు.. పుష్ప రాజ్ వెనకడుగు లేదు..

డిసెంబర్ 17 కే థియేటర్స్ లో వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. దీనితో అన్ని రూమర్స్ కి ఒక ఎండ్ కార్డ్ పడినట్టే అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి దేవి సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ రెండు భాగాలుగా ఈ సినిమాని భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :