సేవా పన్ను మినహాయించడంపై వివరణ ఇచ్చిన తారక్ !
Published on Aug 6, 2017 10:13 am IST


సుకుమార్ దర్శకత్వంలో చేసిన సినిమా ‘నాన్నకు ప్రేమతో’ చిత్ర విషయంలో హీరోగా సేవా పన్నును చెల్లించలేదని వచ్చిన ఆరోపణలపై తారక్ లిఖిత పూర్వకంగా స్పందించారు. అందులో ఆయన ‘2015లో నాన్నకు ప్రేమతో చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం లండన్ లో నిర్మించబడినది. పొరుగుదేశాల్లో హీరోగా అందించిన సర్వీసుకు ఎలాంటి ట్యాక్స్ వర్తించదు అని చెప్పడంతో ఆయా నిర్మాతలు నుండి నేను పన్ను వసూలు చేయలేదు’ అన్నారు.

అలాగే ‘2016 లో సి.ఏ.జి అధికారులు ఎంక్వైరీ చేయడంతో మా ఆడిటర్లు లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు. ఆ తర్వాత మాకు ఎలాంటి ప్రభుత్వ నోటీసులు అందలేదు. ఎన్నో ఏళ్ల నుండి ట్యాక్సులు సక్రమంగా చెల్లిస్తున్న వ్యక్తిని నేను. ఒకవేళ ఈ విషయంపై సంబంధిత అధికారుల నుండి నాకు ఆదేశాలు అందితే చట్టపరంగా నేను చెల్లించాల్సిన రుసుము ఏమైనా ఉంటే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎల్లప్పుడూ చట్టానికి కట్టుబడి ఉండే నేను ఈ విషయంలో కూడా అదే పాటిస్తాను’ అన్నారు.

 
Like us on Facebook