అఫీషియల్ : విజయ్ “వారిసు” స్ట్రీమింగ్ పార్ట్నర్ ఇదే.!

అఫీషియల్ : విజయ్ “వారిసు” స్ట్రీమింగ్ పార్ట్నర్ ఇదే.!

Published on Jan 11, 2023 6:57 AM IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “వారిసు” ఫైనల్ గా ఈరోజు తమిళ్ వెర్షన్ లో అయితే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సాలిడ్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా అన్ని భాషల్లో కూడా భారీ బిజినెస్ ని జరుపుకుంది. ఇక ఈ డీల్ లో సినిమా ఓటిటి హక్కులు కూడా భారీ ధరకి అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ కావడంతో ఈ చిత్రం అఫీషియల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ పై అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని అయితే ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారు. మరికొన్ని నెలలు తర్వాత అయితే ఈ చిత్రం ఓటిటి లో రిలీజ్ కానుంది. అప్పటి వరకు థియేటర్స్ లో అలరిస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా దిల్ రాజు ఈ సినిమాని నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు