మారుతి మరోసారి ఎంటర్టైన్మెంట్ నే నమ్ముకున్నాడు !
Published on Sep 19, 2017 4:36 pm IST


దర్శకుడు మారుతి సినిమాల్ని చూస్తే అందులో కథ కన్నా అందులో నడిచే ఎంటర్టైన్మెంటే ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటుంది. సినిమాలో అసలు కథ, కథనాలకు ఆయన ఎంత ప్రాముఖ్యత ఇస్తారో వినోదానికి అంతే ప్రాముఖ్యత ఇస్తారు. ప్రతి రెండు సన్నివేశాల్లో ఒకటి ఖచ్చితంగా నవ్వించేదై ఉంటుంది. ఆయన కెరీర్లో మంచి విజయాల్ని సాధించిన ‘ఈరోజుల్లో, బస్టాప్, ప్రేమ కథా చిత్రం, భలే భలే మగాడివోయ్’ వంటి సినిమాలన్నీ అలానే ఉంటాయి.

ఇప్పుడు ఇదే సక్సెస్ ఫార్ములాను నమ్ముకుని ఆయన చేసిన ‘మహానుభావుడు’ చిత్రం కూడా వినోదానికి కేరాఫ్ అడ్రెస్ లా ఉండేలా ఉంది. టీజర్ తో ఇందులో హీరో అతి శుభ్రత అనే లక్షణంతో ఉంటాడని, అలాంటి వ్యక్తి జీవితంలోకి అమ్మాయి ఎలా వచ్చింది, అతని లక్షణం అతని జీవితాన్ని ఎలా నడిపింది, చివరికి ఎక్కడకు తీసుకెళ్లింది అనేదే కథని అర్థమైపోయింది.

అలాగే ట్రైలర్ గమనిస్తే అందులో వినోదం పాళ్ళు ఎక్కువగానే ఉంటాయని ఖాయమైపోయింది. కాబట్టే 24 గంటలు కూడా గడవకుండా 2 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది ట్రైలర్. ట్రైలర్ ఇచ్చిన ఈ నమ్మకమే ప్రేక్షకులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. మరి మారుతికి ఇన్నిసార్లు సక్సెస్ ను ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఈసారి ఏ స్థాయి విజయాన్ని ఇస్తుందో చూడాలి.

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి:

 
Like us on Facebook