టాక్..తగ్గని అజిత్ సినిమా థియేటర్స్.?

టాక్..తగ్గని అజిత్ సినిమా థియేటర్స్.?

Published on Dec 17, 2022 7:00 AM IST

తాజాగా కోలీవుడ్ సినిమా దగ్గర సంక్రాంతి బరిలో రెండు భారీ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అవి దళపతి విజయ్ నటించిన వారిసు ఒకటి కాగా మరో చిత్రం అజిత్ కుమార్ నటించిన తునివు. అయితే ఈ రెండు సినిమాలపై కూడా భారీ అంచనాలు నెలకొనగా అక్కడ ఉన్న ఈ గట్టి పోటీలో అయితే నిర్మాత దిల్ రాజు తన వారిసు చిత్రానికి అదనంగా కొన్ని థియేటర్స్ అడగానున్నానని లేటెస్ట్ స్టేట్మెంట్ ఇస్తూ పలు కీలక కామెంట్స్ కూడా చేశారు.

మరి నిన్న మీటింగ్ కోసం కూడా తాను వెళ్లగా ఫైనల్ గా మాత్రం రిలీజ్ లలో ఎలాంటి మార్పులు ఉండవని లేటెస్ట్ గా తమిళ్ సినీ వర్గాలు నుంచి టాక్ వినిపిస్తుంది. అక్కడి రెండు సినిమాలు సమానంగా రిలీజ్ అవుతున్నాయి తప్ప వారిసు కి అయితే ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వబోడం లేదని ఇప్పుడు తెలుస్తోంది. సో మొత్తానికి అయితే మాత్రం తమిళ నాట ఇరు హీరోలు సమానమే అన్నట్టు అనే దానికి ఇది సంకేతం అనేలా కూడా భావించవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు