ఓటిటిలో సెన్సేషనల్ రెస్పాన్స్ తో “ఊరుపేరు భైరవకోన”

ఓటిటిలో సెన్సేషనల్ రెస్పాన్స్ తో “ఊరుపేరు భైరవకోన”

Published on Mar 9, 2024 3:07 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్ గా దర్శకుడు వి ఐ ఆనంద్ తెరకెక్కించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “ఊరుపేరు భైరవకోన” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రం డీసెంట్ బజ్ మరియు ప్రమోషన్స్ నడుమ వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో మంచి వసూళ్లు అందుకోగా జస్ట్ నిన్ననే ఓటిటిలో కూడా రిలీజ్ కి వచ్చింది.

మరి ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ కి తెలుగులో స్ట్రీమింగ్ కి తీసుకురాగా జస్ట్ ఒక్క రోజులోనే ఈ చిత్రం ఇండియా వైడ్ గా నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. దీనితో ఓటిటిలో ఈ చిత్రానికి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా రాజేష్ దండ నిర్మాణం వహించారు. అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు