“ఉస్తాద్ భగత్ సింగ్” ఓటిటి పార్ట్నర్ లాక్ అయినట్టేనా!?

“ఉస్తాద్ భగత్ సింగ్” ఓటిటి పార్ట్నర్ లాక్ అయినట్టేనా!?

Published on Mar 17, 2024 10:07 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) హీరోగా యంగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh). మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం నుంచి ఓ సూపర్ ట్రీట్ ని కూడా మేకర్స్ నిన్ననే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసారు. అయితే ఎప్పుడు వస్తుంది అనేది డేట్ రాలేదు కానీ ఈ మార్చ్ 19న వస్తుంది అన్ని స్ట్రాంగ్ బజ్ ఉంది. ఇక దీనితో పాటుగా ఈ చిత్రం ఓటిటి పార్ట్నర్ అయితే ఇప్పుడు లాక్ అయ్యినట్టుగా వినిపిస్తుంది.

మేకర్స్ ఈ సినిమా ప్రోమో ఒకటి అమెజాన్ ప్రొడ్యూసర్స్ మీట్ లో ప్లే చేయనున్నారని సో దాదాపు ప్రైమ్ వీడియోకే ఉస్తాద్ భగత్ సింగ్ హక్కులు వెళ్లవచ్చని చెప్పాలి. ఇక దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు తెరి కోర్ పాయింట్ మాత్రం తీసుకొని పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసాడు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు