తెలుగు లో “సూపర్ డీలక్స్”… ఆగస్ట్ 6న ఆహా వీడియో లో!

Published on Jul 27, 2021 6:12 pm IST

త్యాగరాజన్ కుమార్ రాజ దర్శకత్వం లో విజయ్ సేతుపతి, సమంత అక్కినేని, రమ్యకృష్ణ, గాయత్రి, మృణాళిని రవి, భగవతి పెరుమాళ్ తదితరులు నటించిన చిత్రం సూపర్ డీలక్స్. ఈ చిత్రం తమిళ నాట సంచలన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు తెలుగు బాషలో అందుబాటులోకి రానుంది. ఈ చిత్రం తెలుగు లో ఆహా వీడియో లో విడుదల అయ్యేందుకు సిద్దం గా ఉంది.

ఆగస్ట్ 6 వ తేదీన వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా ఈ చిత్రం ఆహా వీడియో లో ప్రసారం కానుంది. యువన్ శంకర్ రాజ సంగీతం అందించిన ఈ చిత్రానికి త్యాగ రాజన్ కుమార్ రాజా, మైస్కిన్, నాలన్ కుమారసామి స్క్రీన్ ప్లే అందించారు. పి.ఎస్.వినోద్ మరియు నిరవ్ షా లు చిత్రానికి సినిమాటోగ్రఫి అందించారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం తెలుగు లో అందుబాటులోకి వస్తుండటం పట్ల ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :