‘పడి పడి లేచె మనసు’ విడుదల తేదీ ఫిక్స్ !
Published on Nov 8, 2018 11:00 pm IST

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రాబోతున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఇప్పటికే షూటింగ్ ని పూర్తీ చేసుకున్న ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ ని నవంబర్ 12న రిలీజ్ చేయనున్నారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి సినిమాని నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మురళి శర్మ, సునీల్ లు ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.. హైదరాబాద్, కోల్ కతా, నేపాల్ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది.

ఇక ఈ చిత్రంలో శర్వా ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తుండగా సాయి పల్లవి డాక్టర్ గా కనిపించనుంది. ముఖ్యంగా శర్వానంద్, సాయి పల్లవి మధ్య లవ్ ట్రాక్, వారి పాత్రల మధ్య సాగే కొన్ని సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయట.

  • 10
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook