లేటెస్ట్..తన పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టిన ప్రభాస్.!

Published on Dec 10, 2021 1:00 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్లాన్ చేసిన పాన్ వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ “ప్రాజెక్ట్ కె” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని ఇండియన్ సినిమా దగ్గర అత్యంత ఖరీదైన సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

మరి ఇది వరకే ఆల్రెడీ ప్రభాస్ లేకుండా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం రీసెంట్ గానే కొత్త షెడ్యూల్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో స్టార్ట్ చేసుకోగా దీనికి బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనె కూడా హాజరు అయ్యింది. మరి ఇదిలా ఉండగా ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

ఈరోజు షూట్ నుంచి ఈ భారీ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా అడుగు పెట్టనున్నాడట. దీనితో ఇప్పుడు ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ భారీ సినిమాలో బిగ్ బి అమితాబ్ కూడా నటిస్తుండగా వైజయంతీ మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :