మెసేజ్ ఇవ్వబోతున్న హీరో గోపీచంద్ !

27th, March 2018 - 05:40:07 PM

నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తోన్న ‘పంతం’ సినిమా షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. గోపీచంద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో మెహరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో సోషల్ మెసేజ్ ఉండబోతోందని తెలుస్తోంది. అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులపై ఎదురు తిరిగే వ్యక్తి పాత్రలో గోపిచంద్ కనిపించబోతున్నారు.

గోపీచంద్ చేస్తోన్న 25వ సినిమా అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలున్నాయి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో రాధా మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో మెహ్రీన్ టీచర్ పాత్రలో నటిస్తోంది.