ఇండియాలో “పఠాన్” లేటెస్ట్ వసూళ్ల డీటెయిల్స్.!

Published on Feb 6, 2023 4:00 pm IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా అండ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “పఠాన్”. భారీ అంచనాలు నడుమ వచ్చి ఈ సినిమా షారుఖ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కాగా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఈ సెన్సేషనల్ రన్ ని కొనసాగిస్తోంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా ఇండియాలో అదిరే వసూళ్లు రాబడుతుంది.

ఇక నార్త్ బెల్ట్ లో అయితే ఈ ఆదివారం 27.5 కోట్లు రాబట్టగా తెలుగు సహా తమిళ్ లో కలిపి ఇన్ని రోజుల్లో 430 కోట్ల మేర గ్రాస్ ని పఠాన్ ఇండియా లో ఇప్పటివరకు రాబట్టి అదరగొట్టింది. ఇక ఈ వారంలో కూడా పఠాన్ డీసెంట్ రన్ కొనసాగిస్తోంది అని ట్రేడ్ వర్గాలై వారు చెబుతున్నారు. మరి ఓవరాల్ గా ఈ చిత్రం రన్ ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించగా జాన్ అబ్రహం విలన్ గా నటించాడు.

సంబంధిత సమాచారం :