నేడు కమల్ “విక్రమ్” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి రెడీ!

Published on May 11, 2022 1:34 pm IST

కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజు దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం విక్రమ్. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకం పై ఈ చిత్రాన్ని కమల్ హసన్ మరియు మహేంద్రన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో విజయ్ సేతుపతి మరియు ఫాహద్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. పాతాళ పాతాళ అనే పాటను నేడు సాయంత్రం 7 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది.మాస్ స్టెప్పులతో ఈ సాంగ్ ఉండనున్నట్లు పోస్టర్ ను చూస్తే తెలుస్తుంది. జూన్ 3 వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :