“రిపబ్లిక్” టీం కి పవన్, త్రివిక్రమ్ స్పెషల్ కంగ్రాట్స్.!

Published on Oct 3, 2021 4:00 pm IST

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “రిపబ్లిక్” సినిమాకి ప్రశంసల జల్లు ఆగడం లేదు. ఒక మంచి సబ్జెక్టు ను తెలుగు ఆడియెన్స్ కి దర్శకుడు దేవా కట్ట ఇచ్చినందుకు వారికి సినీ ప్రముఖులు నుంచి రాజకీయ ప్రముఖులు వరకు కూడా అభినందనలు తెలుపుతున్నారు.

తాజాగా ఏపీ టీడీపీ యువ అధినేత నారా లోకేష్ కంగ్రాట్స్ చెప్పగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లు కూడా రిపబ్లిక్ టీం కి స్పెషల్ కంగ్రాట్స్ తెలియజేసారు. ఇద్దరూ కూడా రెండు బొకే లు పంపించి వారి అభినందనలు రాసి జత చేశారు.

దీనితో వీరి మెసేజ్ వారి అభిమానుల్లో వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించగా రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. అలాగే మణిశర్మ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :