“వీరమల్లు” కోసం మళ్ళీ లుక్ మారుస్తున్న పవన్.?

Published on Jan 27, 2022 10:50 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు ఏకకాలంలో చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో దర్శకుడు సాగర్ కే చంద్ర తో “భీమ్లా నాయక్” అనే మాస్ ప్రాజెక్ట్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోగా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన మరో సినిమా కూడా ఉంది. అదే “హరిహర వీరమల్లు”. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా పాన్ ఇండియన్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేశారు.

మరి దాదాపు 60 శాతం సినిమా కంప్లీట్ కాగా మిగతా షూట్ ని కాస్త పరిస్థితులు సర్దుమణిగాక రీస్టార్ట్ చెయ్యనున్నారు. అయితే ఈ సినిమాలో పవన్ లుక్ కాస్త కొత్తగానే ఉందనున్న సంగతి తెలిసిందే. మీసకట్టు పొడవాటి శిరోజాలు ఇలా ఒక పీరియాడిక్ సినిమాకి కావాల్సినట్టుగా తన లుక్ ని ఈ సినిమాకి ప్రిపేర్ చేశారు. అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ పవన్ లేటెస్ట్ లుక్స్ బయటకి రాగా అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అయితే ఇందులో చూస్తే మళ్ళీ పవన్ లాంగ్ హెయిర్ లోనే కనిపిస్తున్నాడు. దీనితో వీరమల్లు సినిమా కోసం మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాడని అర్ధం అవుతుంది. కాకపోతే లైట్ గా మళ్ళీ గడ్డం పెంచడం స్టార్ట్ చెయ్యడంలో ఈ సినిమాలో ఇలా కూడా కనిపిస్తాడా అని ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. మరి వేచి చూడాలి ఈ లుక్ కూడా సినిమాలో ఉందో లేదో.

సంబంధిత సమాచారం :