ఆ మాటలే నన్ను స్టార్ ను చేశాయి – పవన్ కళ్యాణ్

Published on Apr 5, 2021 9:00 am IST

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ ‘వ‌కీల్ సాబ్‌’ ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. నిన్న రాత్రి ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను చిత్రయూనిట్ హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మహోన్నత స్థానానికి వెళ్లి, అద్భుతమైన విజయాలు సాధించిన దిల్ రాజుగారి లాంటి వ్యక్తితో.. వకీల్ సాబ్ వంటి చిత్రాన్ని చేసినందుకు.. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా కోసం సినిమాలు చేయమని నేను ఎవరిని యాచించలేను. అసలు నేనెప్పుడూ నటుడు కావాలి అనుకోలేదు. నేనెప్పుడూ త్రివిక్రమ్ గారికి చెప్తూ ఉంటాను.

నేను చాలా చిన్న జీవితం గడపాలని కోరుకుంటున్నాను అని. నన్ను ఎవరు గుర్తించకూడదు. నన్ను ఎవరు చూడకూడదు. చాలా సింపుల్ జీవితం గడపాలని అనుకుంటున్నాను అని.. కానీ నాకు అది తప్ప అన్ని జరిగాయి. మా అన్నయ్య చిరంజీవిగారు అన్న ఒక మాట నన్ను నటుడిని చేసింది. నీ మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. అన్నదమ్ముల బాధ్యత లేదు. కాబట్టి నువ్వు ఒక నటుడివి అయ్యి ఏదో ఒక పని ఇలాంటి స్పిచ్యువాలిటీ గురించి మాట్లాడతావా అంటే నాకప్పుడు అనిపించింది. ఆరోజు ఆయన అన్న ఆ మాటలు నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టాయి. అని పవన్ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :