ఇంట్రెస్టింగ్..జస్ట్ మూడు వారాల్లో పవన్ రీమేక్ పూర్తి?

Published on Jun 12, 2022 3:25 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలు అలాగే రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే సినిమాల్లో అయితే ఇప్పుడు పవన్ మళ్ళీ కాస్త దూరంగానే కనిపిస్తున్నాడు. పైగా రీసెంట్ గా తన రాజకీయ పార్టీ భారీ యాత్ర ప్లాన్ ని అనౌన్స్ చేయడంతో కొన్ని నెలల పాటూ సినిమాలకి దూరం అయ్యే పరిస్థితి నెలకొంది. దీనితో పవన్ సినిమాలు ఎలా కంప్లీట్ అవుతాయి అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అయితే ఈ లిస్ట్ లో రీసెంట్ గా వచ్చిన రీమేక్ వినోదయం సైతం పై అయితే ఇంట్రెస్టింగ్ టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని పవన్ కేవలం మూడు వారాల్లోపే కంప్లీట్ చేసేయనున్నట్టు తెలుస్తుంది. అంటే తాను ఈ సినిమాకి కేవలం 20 రోజులు మాత్రమే కాల్షీట్స్ ఇచ్చారట. తన షూటింగ్ పార్ట్ కి అన్ని రోజులు సరిపోగా మిగతా రోజుల్లో సాయి ధరమ్ తేజ్ తదితరులు షూటింగ్స్ ఉంటాయి. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులో కూడా సముద్రఖని నే దర్శకత్వం వహించనున్నారు.

సంబంధిత సమాచారం :