పవన్ కామెంట్స్ వైరల్..ఫ్యాన్స్ ఎమోషనల్!

Published on Oct 3, 2021 9:37 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓ పక్క తన సినిమాలతో పాటుగా మరోపక్క రాజకీయ పనుల్లో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న టికెట్ రేట్లు ఇష్యూ పై కూడా తాను మాట్లాడడంతో ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి. తర్వాత సర్దుమణిగే దిశగా కూడా వెళ్లాయి. అయితే పవన్ గత మూడు నాలుగు రోజులు నుంచి పొలిటికల్ గా బిజీగా ఉండగా..

నిన్న ఓ మీటింగ్ లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒకవేళ తాను చనిపోతే.. అంటూ చేసిన కామెంట్స్ అభిమానులని ఇప్పుడు ఒకింత భావోద్వేగానికి లోను చేస్తున్నాయి. దీనితో ఈ వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి అయితే పవన్ “భీమ్లా నాయక్” మరియు తన పాన్ ఇండియన్ సినిమా “హరిహర వీరమల్లు” కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.

సంబంధిత సమాచారం :