ఆకట్టుకుంటున్న సూపర్ స్టార్ సినిమా ట్రైలర్ స్నీక్ పీక్ !

Published on Dec 31, 2018 11:58 am IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పేట’. కాగా ఈ సినిమా ట్రైలర్ స్నీక్ పీక్ ని తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం పేట ట్రైలర్ స్నీక్ పీక్ యూట్యూబ్ లో హల చల్ చేస్తోంది. ముఖ్యంగా సూపర్ స్టార్ అభిమానులను ఈ స్నీక్ పీక్ బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రం ‘పేట’ సంక్రాంతికి కానుకగా జనవరి 10న విడుదలకానుంది.

కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, త్రిష ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది

ట్రైలర్ స్నీక్ పీక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :