ఫోటో మూమెంట్ : తన క్యూట్ ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ లో బన్నీ.!

Published on Mar 6, 2022 4:00 pm IST

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర తన స్టాంప్ వేసిన మరో టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తన లేటెస్ట్ సినిమా పుష్ప తో సెన్సేషనల్ విజయాన్ని అందుకున్న బన్నీ వీలు దొరికినప్పుడు అంతా తన సినిమా గ్యాప్ లో తన ఫ్యామిలీ ముందు వచ్చి వాలిపోతాడు. ఇలా ఎన్నో స్వీట్ మూమెంట్స్ ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఐకాన్ స్టార్ ఇపుడు మరో బ్యూటిఫుల్ ఫోటో ని షేర్ పోస్ట్ చేసాడు.

తాను తన భార్య స్నేహ మరియు పిల్లలు అల్లు అయాన్, అర్హ లు ఒక క్యూట్ సెలెబ్రేషన్స్ లో కనిపిస్తున్నారు. అయితే ఇది బన్నీ తాను మరియు తన భార్య స్నేహ ల వివాహ బంధం నేటితో 11 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో దానిని కేక్ కట్ చేసి ఎంతో ఆనందంగా సెలెబ్రేట్ చేసుకున్నట్టు తాను తెలిపాడు. దీనితో బన్నీ ఫ్యాన్స్ ఈ బ్యూటిఫుల్ స్నాప్ చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :