ఫోటో మూమెంట్ : హీరో సూర్యతో సురేష్ రైనా..

ఫోటో మూమెంట్ : హీరో సూర్యతో సురేష్ రైనా..

Published on Mar 7, 2024 7:05 AM IST

Suriya, Suresh

కోలీవుడ్ విలక్షణ హీరో సూర్య హీరోగా ఇప్పుడు దర్శకుడు శివతో భారీ పాన్ ఇండియా సినిమా “కంగువ” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుండగా లేటెస్ట్ గా అయితే సూర్య మరియు ఇండియన్ టీం మాజీ క్రికెటర్ లెఫ్ట్ హ్యాండ్ డాషింగ్ బాట్స్మెన్ సురేష్ రైనా కలిసి కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే రీసెంట్ గానే ఓ క్రికెట్ ఫార్మాట్ స్టార్ట్ కాగా ఒకో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోలు ఆయా రాష్ట్రాల తరపున టీం లకి యజమానిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ ఫార్మాట్ కి సంబంధించి నిన్న సినీ స్టార్స్ తో పాటుగా ప్రముఖ క్రికెటర్స్ కూడా కలిసి సరదాగా క్రికెట్ ఆడడం జరిగింది. ఈ సమయంలో సురేష్ రైనా తనని స్టేడియంలో కలవడం కలిసి సూర్యని కలవడం ఎంతో ఆనందంగా ఉందని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసాడు అలాగే అతి త్వరలోనే చెన్నైలో కలుద్దామని కూడా తెలిపాడు. దీనితో ఈ పిక్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు