లేటెస్ట్..సాయి తేజ్ పై కేస్ నమోదు చేసిన పోలీసులు!

Published on Sep 11, 2021 8:00 am IST

నిన్న రాత్రి మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతంలో ఓ పెద్ద బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో తాను హెల్మెట్ ధరించినందున కీలక అవయవాలకు పెద్దగా గాయాలు కాలేదు కానీ మెడ ప్రాంతంలో ఎముక కణజాలం దెబ్బ తింది అని వైద్యులు తెలియజేసారు. అయితే ఇదిలా ఉండగా తాజాగా దుర్గం చెరువు ప్రాంతం పోలీసులు సాయి తేజ్ పై ద్వి చక్ర వాహన యాక్ట్ పై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది.

తాను బైక్ రాష్ డ్రైవింగ్ చేసినందున ఐపీసీ సెక్షన్ 336 మరియు 184 సెక్షన్ల పై కేసు నమోదు చేసి అతని బైక్ ని కస్టడీ లోకి తీసుకున్నారట. అలాగే సాయి తేజ్ ఎలాంటి మద్యం సేవించలేదు అని కూడా క్లారిటీ ఇచ్చారు. మరి ప్రస్తుతం సాయి తేజ్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా మెగా ఫ్యామిలీ పెద్దలు దగ్గరుండి ఆరోగ్య పరిస్థితులను దగ్గరుండి చూసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :