పవన్ సినిమాలో నటిస్తున్న ప్రముఖ తారాగణం !

17th, April 2017 - 09:04:48 AM


పవన్ – త్రివిక్రమ్ ల కలయికలో చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకప్పటి స్టార్ హీరోయిన్, నటి కుష్బు ఈ సినిమాలో ఒక కీ రోల్ చేస్తుండగా ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో పవన్ కు తాతయ్యగా నటించిన బొమన్ ఇరానీ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని వినికిడి.

అలాగే రావు రమేష్, మురళి శర్మ, సంపత్, రఘుబాబు వంటి విభిన్న, కీలక సహాయక నటులు కూడా ఏ సినిమాలో కనిపించనున్నారట. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పవన్ మునుపెన్నడూ లేని విధంగా సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ లుక్ లో కనిపించనున్నాడు. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందివ్వనుండగా షూటింగ్ ను ఆగష్టు నెల కల్లా పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నారు త్రివిక్రమ్.