మెగా స్టార్ సినిమాలో పవర్ స్టార్ ?
Published on Nov 25, 2017 10:38 am IST

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్న సినిమా సైరా నరసింహారెడ్డి. ఇటివల ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల అయ్యింది. వచ్చే నెల మొదటి వారంలో సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. అదే విధంగా ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబులు మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. పవన్ కోసం ఒక పాత్ర డిజైన్ చేసాడంట దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ వార్త అభిమానులకు నిజంగా పండగే. ప్రస్తుతం లొకేషన్ సెర్చింగ్ పనుల్లో ఉన్న చిత్ర యూనిట్ త్వరలో ఈ సినిమాకు సంభందించిన మరిన్ని విషయాలు మీడియాతో పంచుకోనున్నారు.

 
Like us on Facebook