విజయ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ నిర్ణయించిన మురుగదాస్ !
Published on Jun 21, 2018 6:17 pm IST

తమిళ స్టార్ హీరో విజయ్ తన 62వ చిత్రాన్ని మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుతున్న చిత్ర యూనిట్ ఇప్పటికే 80 శాతం చిత్రీకరణను పూర్తిచేసింది. గతంలో విజయ్, మురుగదాస్ ల కలయికలో వచ్చిన ‘తుపాకి, కత్తి’ వంటి సినిమాలు భారీ విజయాల్ని అందుకోవడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఆశలే ఉన్నాయి.

ఇకపోతే కొద్దిసేపటి క్రితమే మురుగదాస్ సినిమా ఫస్ట్ లుక్ పోసర్ ను రిలీజ్ చేసి చిత్రానికి ‘సర్కార్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రకటించారు. తమ అభిమాన హీరో సినిమాకు ఇంత పవర్ ఫుల్ టైటిల్ ను నిర్ణయించడం పట్ల విజయ్ అభిమానులు పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook