తిరిగొచ్చి హైదరాబాద్ లో మొదలుపెట్టిన ప్రభాస్, అనుష్క !

15th, April 2017 - 05:37:01 PM


విడుదల సమయం దగ్గర పడుతుండడంతో బాహుబలి 2 చిత్ర ప్రమోషన్లు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే ముంబై లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని వచ్చిన ప్రభాస్, అనుష్క ఇప్పుడు హైదరాబాద్ లో పాల్గొంటున్నారు. వీరిద్దరూ కలసి టివి ఇంటర్వ్యూ కార్యక్రమాలను మొదలు పెట్టారు.

కాగా కేరళ, తమిళనాడులో కూడా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.కాగా దేశవ్యాప్తంగా ఈ చిత్రం పై భారీ అందచనలు నెలకొని ఉన్నాయి.కేవలం యూఎస్ లోనే 1100 స్క్రీన్స్ లో ఈ చిత్రం విడుదలవుతుందంటే ఆ క్రేజ్ ని అర్థం చేసుకోవచ్చు.