“సలార్” అప్డేట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటా.. ప్రభాస్ అభిమాని లెటర్ వైరల్..!

Published on May 10, 2022 11:54 pm IST


పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ఆదిపురుష్‌, సలార్‌, ప్రాజెక్ట్‌ కె వంటి పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉ‍న్న సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన “రాధేశ్యామ్‌” రిజల్ట్‌ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కాస్త నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు సాలిడ్‌ యాక్షన్‌ మూవీ “సలార్‌”పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాను కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తుండటంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించి కొత్తలో ప్రభాస్‌ లుక్‌ మినహా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. దీంతో ప్రభాస్‌ అభిమాని ఒకరు సలార్‌ అప్డేట్ ఇవ్వాలని లేదంటే సూసైడ్‌ చేసుకుంటానని డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌కు లెటర్‌ రాశాడు. సలార్ సినిమా ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా ఇప్పటివరకు ఎలాంటి గ్లింప్సెస్‌ రిలీజ్‌ చేయలేదు. మే చివరి వారంలోగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వలేదంటే సూసైడ్‌ చేసుకుంటానని రాసిన లెటర్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత సమాచారం :