వైరల్ గా మారిన పాన్ ఇండియా స్టార్ లేటెస్ట్ లుక్స్.!

Published on Aug 4, 2022 8:07 am IST


ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాల షూటింగ్స్ నుంచి చిన్న పాటి బ్రేక్ లో ఉన్న ప్రభాస్ రీసెంట్ గా ఓ హాలీవుడ్ సినిమా చూసి ఎంజాయ్ చేసాడు. అంతే కాకుండా నిన్ననే టాలీవుడ్ లో రిలీజ్ కి వస్తున్న లేటెస్ట్ చిత్రం “సీతా రామం” ప్రీ రిలీజ్ వేడుకకి హాజరయ్యాడు. అయితే ఈ వేడుకల సమయంలో ప్రస్తుతం ప్రభాస్ లుక్స్ మంచి వైరల్ గా మారాయి.

ముఖ్యంగా ప్రభాస్ స్టైలింగ్ అమితంగా అందరినీ ఆకట్టుకుంది. తన పర్సనాలిటీకి తగ్గట్టుగా స్టైలిష్ టి షర్ట్ మరియు జీన్స్ తో మంచి డాపర్ గా కనిపించిన డార్లింగ్ ఫ్యాన్స్ కి అయితే మంచి కిక్ ని చాలా రోజులు తర్వాత బయట కనిపించి అందించాడు. దీనితో ఈ ఫోటోలు అయితే ఇప్పుడు వైరల్ గా మారాయి. మరి ప్రస్తుతం అయితే ప్రభాస్ ప్రాజెక్ట్ కే మరియు సలార్ చిత్రాల్లో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :