ఏడేళ్లు పూర్తి చేసుకున్న ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్ “బాహుబలి”..!

Published on Jul 10, 2022 12:00 pm IST


టాలీవుడ్ సహా ఇండియన్ సినిమా మార్కెట్ ని బాహుబలి కి ముందు బాహుబలికి తర్వాత అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ల కాంబోలో వచ్చిన ఇండియాస్ బిగ్గెస్ యాక్షన్ అండ్ ఎపిక్ డ్రామా “బాహుబలి” అప్పట్లో ఓ సంచలనం రేపింది. స్టార్ట్ చెయ్యడం సింగిల్ సినిమా గానే స్టార్ట్ చేసినా తర్వాత సినిమా స్కేల్ పెరగడంతో రెండు భాగాలుగా చెయ్యాల్సి వచ్చింది.

అలాగే పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం(బాహుబలి 1) ఇంత పెద్ద హిట్ అవుతుంది అని కూడా మేకర్స్ అనుకోలేదు. కానీ ఆడియెన్స్ భారీ విజయాన్ని అందించారు. ఇంకా అప్పుడప్పుడే ఇండియన్ సినిమా దగ్గర బడ్జెట్ పెరుగుతూ కొన్ని లార్జ్ స్కేల్ ఉన్న సినిమాలు కూడా వస్తున్నాయి కానీ ఇలాంటి నేపథ్యంలో సినిమాలు చాలా తక్కువే వచ్చాయి. ఆ టైం రిలీజ్ అయ్యింది బాహుబలి ట్రైలర్..

అంతే అక్కడ నుంచి అంతా మారిపోయింది. రాజమౌళి చూపించిన గ్రాండ్ విజువల్స్ ఆ యుద్ధ సన్నివేశాలు చూసి ఇండియన్ ఆడియెన్స్ కళ్ళు తిప్పుకోలేకపోయారు. మరి అన్నే అంచనాలు నడుమ ఈ చిత్రం ఇదే జూలై 10న రిలీజ్ అయ్యి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచి ఒక గేమ్ ఛేంజర్ గా మారి నేటితో ఏడేళ్లు పూర్తి కాగా ఇప్పుడు సినీ ప్రముఖులు సహా అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :