ఈ రెండు భారీ చిత్రాలకు ప్రభాస్ ఒకేసారి.!

Published on May 9, 2021 2:00 pm IST

ప్రస్తుతం మన ఇండియాలోనే బిగ్గెస్ట్ మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మారాడు. అయితే ఇప్పుడు తాను చేస్తున్న ఒకదాన్ని మించిన ఒకటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. మొత్తం నాలుగు ఆన్ లైన్ లో ఉండగా ఆల్రెడీ షూట్ లో మూడు చిత్రాలు ఉన్నాయి. అలాగే వాటిలో ఇప్పుడు రెండు సినిమాలు హైదరాబాద్ లోనే షూటింగ్ కానున్నాయని తెలుస్తుంది.

వాటిలో ఆల్రెడీ ఆదిపురుష్ షూట్ ఫిక్స్ కాగా మరో సినిమాలో కూడా ప్రభాస్ ఒకేసారి పాల్గొననున్నారని తెలుస్తుంది. అదే సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై కూస సాలిడ్ అంచనాలు ఉన్నాయి. మరి ఈ రెండు చిత్రాల షూట్ లో ప్రభాస్ ఒకేసారి చేయనున్నాడట. మొత్తానికి మాత్రం ప్రభాస్ ఇలాంటి సమయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడా తగ్గడంలేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :