‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్..!

Published on Nov 4, 2021 3:02 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్నాడు. వీటిలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం “ఆదిపురుష్”. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 11న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, సీతగా కృతి సనోన్‌ నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే రావణ పాత్రధారి సైఫ్ అలీఖాన్ షూటింగ్ పార్ట్, సీత పాత్రదారిణి కృతీ సనన్ షూటింగ్ పార్ట్‌ని పూర్తి చేసిన ఓమ్ రౌత్ తాజాగా ప్రభాస్‌ షూటింగ్ పార్ట్‌ని పూర్తి చేశాడు. దీంతో ముంబైలోని సెట్‌లో కేక్ కట్ చేసి చిత్ర యూనిట్ వేడుకను జరుపుకుంది. ప్రభాస్ షూటింగ్ పార్ట్‌ పూర్తి చేయడంతో, బ్యాలెన్స్ టాకీ పార్ట్‌లను నవంబర్‌లో చిత్రీకరించనున్నారు. వచ్చే ఏడాది వేసవి వరకు వీఎఫ్‌ఎక్స్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంటుంది.

సంబంధిత సమాచారం :