సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న “ఉత్తర దక్షిణ” చిత్రం..!

సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న “ఉత్తర దక్షిణ” చిత్రం..!

Published on Oct 5, 2021 8:00 AM IST


చైతన్య వర్మ, హారిక వర్మ, వినయ్ కశ్యప్, రాకీ, హారిక, సతీష్ సారిపల్లి, శృతి మెహర్, జయ నాయుడు, లలితా జోస్యూల, ర్యాలీ మోహన్ రావు నటీనటులుగా రాజు పాట్ల దర్శకత్వంలో షేడ్ స్టూడియోస్ సమర్పణలో కె తరుణ్, JSS రాజు పాట్ల కలిసి సంయుక్తంగా నిర్మించిన డెమో షాట్ ఫిల్మ్ “ఉత్తర దక్షిణ” ఈ డెమో ఫిల్మ్ ను షేడ్ స్టూడియోస్ సపోర్ట్‌తో యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్ షోను నటుడు, నిర్మాత డి.యస్ రావు, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్య నారాయణ మొదలగు సినీ పెద్దలకు ప్రదర్శించడం జరిగింది.

ఈ సందర్భంగా అతిథిగా వచ్చిన నటుడు నిర్మాత డి.ఎస్.రావు మాట్లాడుతూ ఈ సినిమా చూసిన తర్వాత మట్టిలోని మాణిక్యాలను వెలికితీసినట్టి దర్శకుడు ఆర్టిస్టులతో చాలా మంచి నటనను రాబట్టుకున్నాడని, కొత్తవారైనా చాలా బాగా నటించారని అన్నారు. దర్శకుడు ఎంతో ఏకాగ్రతతో ఈ సినిమా తీశాడని, నేను సినిమాను చూసినప్పుడు ఎంతో ఆసక్తిగా అనిపించిందని, ఒక ఆడియన్ మనసులో ఏది చొరబడకుండా స్క్రీన్ పైనే ఏకాగ్రతగా చూసినప్పుడే అక్కడ డైరెక్టర్ సక్సెస్ అయినట్లు అని అన్నారు. అలాగే మాస్క్ పెట్టుకోకుండా తిరిగే వారికోసం తీసిన “అజ్ఞాని” కూడా చాలా బాగుందని, ఈ అజ్ఞానం షార్ట్ ఫిల్మ్ ను ట్రైలర్‌గా ప్రతి సినిమా థియేటర్‌లో వేస్తే ప్రజల్లో అవేర్‌నెస్ తీసుకు వచ్చిన వారిమవుతామని అన్నారు. చిత్ర యూనిట్ మొత్తానికి అల్ ద బెస్ట్ అని తెలిపారు.

నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సినిమా షార్ట్ ఫిలిం చాలా అద్భుతంగా ఉందని, కొత్త వాళ్ళు అయినా కూడా చాలా బాగా తీశారని అన్నారు. పెద్ద ప్రొడ్యూసర్ దగ్గర ట్రై చేయండి అక్కడ కాకపోతే నేను ప్రొడ్యూస్ చేస్తాను అని అన్నారు.

షేడ్ స్టూడియోస్ అధినేత దేవి ప్రసాద్ మాట్లాడుతూ నేను కూడా 10 సంవత్సరాల క్రితం ఇలా షార్ట్ ఫిలిమ్స్ చేశానని, ఎక్కడ రిలీజ్ చేయాలో తెలియక తిరిగేవాణ్ణి అప్పుడు నాకు ఎటువంటి ప్లాట్ ఫామ్ ఉండేది కాదని, అలా నాకు అప్పుడు పుట్టిన ఐడియా నుండి పుట్టుకొచ్చిందే షేడ్ స్టూడియోస్ అని అన్నారు. ఉత్తర దక్షిణ డెమో ఫిల్మ్ చూశాను చాలా బాగుందని, ఇలాంటి మంచి షార్ట్ ఫిలిమ్స్ మా షేర్ స్టూడియోస్ హెల్ప్ అవుతున్నందుకు నా ఫస్ట్ సక్సెస్ ఇదే అనిపిస్తుందని అన్నారు. షార్ట్ ఫిలిం గాని పెద్ద సినిమా గానీ చేయడం అంత ఈజీ కాదు. ఒక పెళ్లి చేస్తే అందరినీ ఎలా కేర్ తీసుకొని వారికి భోజనాలు ఏర్పాటు చేసి వారికి ఇబ్బంది కలగకుండా చూసుకొని పెళ్లి కార్యక్రమం చేస్తామో అలాగే సినిమా తీసినా డెమో ఫిల్మ్ తీసినా కూడా ప్రతిరోజు ఒక పెళ్లి చేసినట్టే అవుతుందని, ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అనే వారు ఇప్పుడు సినిమా చేసి చూడు ఆ కష్టం ఏంటో తెలుస్తుంది అనడంలో సందేహం లేదని అన్నారు. ఎవరి దగ్గరైనా మంచి కాన్సెప్ట్ ఉండి మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ సెటప్ అందిస్తామని, చాలా మందికి షూటింగ్ కే బడ్జెట్ అయిపోతుంది పోస్ట్ ప్రొడక్షన్‌కి బడ్జెట్ ఉండదు అటువంటి వారిని మేము టేకోవర్ చేసి మేము సపోర్ట్ గా ఉంటామని అన్నారు.

చిత్ర దర్శకుడు రాజు పాట్ల మాట్లాడుతూ రాజ్ కందుకూరి గారు, తుమ్మల పల్లి రామ సత్య నారాయణ, డి.యస్ రావు గారికి ధన్యవాదాలు వారంతా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారని, ఒక డెమో ప్రాజెక్ట్ ద్వారా ఎవరికి రాని అవకాశం కల్పించి చిత్రం విజయవంతమైనట్లు చేశారు. నిర్మాతలు, షేడ్ స్టూడియో వారికి నా ధన్యవాదాలు అని అన్నారు. శుక్రన్ గారు నాకు చాలా హెల్ప్ చేశారు. ఉత్తర దక్షిణతో పాటు నేను తీసిన అజ్ఞానిని చూసిన వారందరూ కూడా చూసిన రెండూ నిమిషాల్లోనే ఎమోషన్ కనెక్ట్ అవుతున్నారు. ఇది ఒక డెమో ప్రాజెక్టు ఇందులో 26 మినిట్స్ మాత్రమే తీయడం జరిగింది. చాలా ఎమోషన్‌తో కూడుకున్న సినిమా ఇది అని, దీని తర్వాత ఇంకా వన్ అండ్ ఆఫ్ అవర్ కథ ఉంది. నేను చెప్పిన దాంట్లో ఫైవ్ పర్సెంట్ కథ కూడా తీయలేదు. మీ అందరి సపోర్ట్ ఉంటే ఈ డెమో ఫిల్మ్ ను ఓటిటి కంటెంట్ కు సినిమాగా తీసి ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాను. ఆర్ జి గారి ఒక్క యాడ్ వల్ల సినిమా పుట్టింది. ఆయనను ఇంప్రెస్ చేయాలని కరోనాను కూడా లెక్క చేయకుండా ఈ ప్రాజెక్ట్ చేశాను. ఈ ఫిల్మ్ కు యూట్యూబ్ లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.చాలా మంది షేర్ చేస్తున్నారు.వారికి నా ధన్యవాదాలు. నేను చేసిన ఈ టూ మినిట్స్ ప్రాజెక్ట్ ను ఆర్.జి.వి గారికి డెడికెడ్ చేస్తున్నానని అన్నారు.

చైతన్య వర్మ మాట్లాడుతూ రాజు నాకు ఏదైతే కథ నాకు నెరేట్ చేశాడో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అదే తీశాడు. స్క్రీన్ మీద కనిపించిన అందరూ చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారని, వీరంతా ఇంత బాగా చేశారు అంటే ఆ కష్టం అంతా రాజు గారికే చెందుతుందని అన్నారు.

హారిక మాట్లాడుతూ ఈ సినిమాలో నేను చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాను ఇంత మంచి షార్ట్ ఫిలింలో నన్ను తీసుకున్నందుకు దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలియచేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటీనటులందరూ ఇంతమంచి కంటెంట్ ఉన్న చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు