మా ఎలక్షన్స్: ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి గెలిచిన 11 మంది రాజీనామా!

Published on Oct 12, 2021 5:43 pm IST

మా ఎన్నికల్లో ఎప్పుడు జరగని విధంగా ఈ ఏడాది ఎన్నికలు చాలా ఉత్కంఠ గా జరిగాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రెసిడెంట్ గా గెలుపొందారు. అయితే ఎన్నికల్లో జరిగిన పలు కారణాల వలన నాగబాబు, ప్రకాష్ రాజ్ లు ఇప్పటికే తమ సభ్యత్వ పదవికి రాజీనామా చేయడం జరిగింది. అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి గెలిచిన వారు అందరూ కూడా రాజీనామా చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.

ఈ మేరకు రాజీనామా చేసిన సభ్యులు ప్రెసిడెంట్ కి లేఖ రాయడం జరిగింది. ఏ సంస్థ అయినా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలి అంటే, అందరి ఆలోచనలు, ఆచరణలు ఒకేలా ఉండటం అవసరం అని అన్నారు. అప్పుడే సంస్థ సజావుగా, ఆరోగ్యం గా, సభ్యుల శ్రేయస్సు దిశగా నడిచే అవకాశం ఉంటుంది. గత రెండేళ్లలో నరేష్ గారు మా అధ్యక్షులు గా ఉన్న సమయం లో తానే వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం,అంతా తానే అయ్యి మా కోసం ఏ పని జరగనివ్వని స్థితికి తీసుకు వచ్చారు. అంతేకాక జరిగిన గొప్ప పనుల పై కూడా బురద జల్లారు అంటూ చెప్పుకొచ్చారు. విష్ణు ప్యానెల్ నుండి, ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి ఈసారి గెలవడం జరిగింది. అయితే మళ్ళీ మా లో భిన్న అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది అని, సహజం గా పశ్నించే వ్యక్తిత్వం ఉన్న మేము అడగకుండా ఉండలేము అని, అందుకని మా సంస్థను శ్రీ విష్ణు గారి ప్యానెల్ వ్యక్తులే నడిపితే మా సభ్యులకు మంచి జరగవచ్చు అనే ఆశతో, ఉద్దేశ్యం తో మా పదవులకు మనసా వాచా కర్మణా రిజైన్ చేస్తున్నాం అని అన్నారు. కానీ ప్రశ్నిస్తూనే ఉంటాం అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :