ముగింపు దశకు చేరుకున్న థియేటర్ల బంద్
Published on Mar 6, 2018 1:55 pm IST

డిజిటల్ ప్రొవైడర్లు నిబంధనలకు విరుద్దంగా వసూలు చేస్తున్న ఫీజులకు నిరసనగా దక్షిణభారత నిర్మాతల మండలి మార్చి 2నుండి థియేటర్ల మూసివేతకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గత నాలుగు రోజులుగా ఏపి, తెలంగాణల్లో అన్ని థియేటర్లలో షోలు నిలిచిపోయాయి.

తాజాగా జరిగిన చర్చలు కొంత సఫలమవడంతో ఈ శుక్రవారం నుండి అన్ని సినిమా హాళ్లు తెరుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో గత వారంలో ఆగిపోయిన కొన్ని సినిమాలు ఈ వారంలో రిలీజ్ కానున్నాయి. ఈ నిరసన ముగింపుకు సంబందించిన అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రం వెలువడే అవకాశముంది.

 
Like us on Facebook