‘ధమాకా’ నుండి మోస్ట్ అవైటెడ్ ‘పల్సర్ బైక్’ వీడియో సాంగ్ రిలీజ్

Published on Jan 23, 2023 9:25 pm IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సొంతం చేసుకున్న లేటెస్ట్ మూవీ ధమాకా. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు నిర్మించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. రవితేజ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఈ మూవీని ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించి అందరి నుండి అభినందనలు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఈమూవీ లోని సాంగ్స్ అన్ని కూడా మంచి పాపులర్ అవగా ముఖ్యంగా సినిమాలో కీలకమైన సీన్ లో వచ్చే పల్సర్ బైక్ సాంగ్ కి అయితే థియేటర్స్ లో ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మరింత సూపర్ రెస్పాన్స్ లభించింది. కాగా ఆ సాంగ్ ఫుల్ వీడియో ని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు మేకర్స్. ప్రస్తుతం ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇక మొన్న ఓటిటి లో రిలీజ్ అయిన ధమాకా, బుల్లితెర ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోందని యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :