ఆడియెన్స్ లో తగ్గని “పుష్ప” హవా..ముఖ్యంగా వారిలో.!

Published on Jan 16, 2022 7:05 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “పుష్ప ది రైజ్”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా పాన్ ఇండియన్ వైడ్ రిలీజ్ అయ్యి ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుందో అందరికీ తెలిసిందే. గత ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన ఏకైక చిత్రంగా ఇది నిలిచింది.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా రీసెంట్ గానే అన్ని భాషల్లో కూడా ఓటిటి లో రిలీజ్ అయ్యింది. ఇక ఇక్కడ నుంచి మరింత మందికి రీచ్ అయ్యిన పుష్ప హవా మాత్రం ఇంకా తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో పుష్ప సినిమా చూసిన ఆడియెన్స్ గాని సెలెబ్రెటీలు కానీ తమ స్పందన చెప్పకుండా ఉండలేకపోతున్నారు.

అయితే ఇందులో ఎక్కువగా హిందీ ఆడియెన్స్ ఆ తర్వాత తమిళ్ ఆడియెన్స్ కనిపిస్తున్నారు. ఇది మాత్రం బన్నీ కి నిజంగా ఒక పాన్ ఇండియా ట్రూ సక్సెస్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :