ఆల్ టైం రికార్డ్స్ సెట్ చేస్తున్న “పుష్ప” మాస్ సాంగ్.!

Published on Oct 29, 2021 10:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఫస్ట్ ఎవర్ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి చిత్ర యూనిట్ ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేస్తుండగా అవి ఒకదాన్ని మించి ఒకటి చార్ట్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి.

నిన్ననే ఈ సినిమా నుంచి మాస్ సాంగ్ “సామి సామి” రిలీజ్ చెయ్యగా దానికి ఇంకా 24 గంటలు గడవక ముందే ఆల్ టైం రికార్డు సెట్ చేసేసినట్టు తెలుస్తుంది. దీనికి ముందు ఇదే సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేక సాంగ్ కి 24 గంటల్లో 8.3 మిలియన్ వ్యూస్ ఉండగా దానిని ఆల్రెడీ పుష్ప మూడో సినిమా 8.5 మిలియన్ వ్యూస్ తో బ్రేక్ చేసేసి ఆల్ టైం రికార్డు సెట్ చేసింది.

మొత్తానికి మాత్రం బన్నీ, సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ ల కాంబోకి తిరుగు లేదని మళ్ళీ ప్రూవ్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More