ఇండియన్ సినిమా ప్రపంచ స్థాయిలో ఇక తగ్గేదే లే…”ఆర్ఆర్ఆర్” కి పుష్ప టీమ్ బెస్ట్ విషెస్

Published on Mar 24, 2022 10:04 pm IST

దర్శక దిగ్గజం, జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా రౌద్రం రణం రుధిరం చిత్రం విడుదల కి సిద్దం అవుతోంది. అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు నటించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చ్ 25 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానున్న ఈ చిత్రం కి బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు.

ఈ మేరకు పుష్ప టీమ్ సైతం ఆర్ ఆర్ ఆర్ చిత్రం కి తనదైన శైలి లో బెస్ట్ విషెస్ ను తెలిపింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ రిసౌండ్ ను క్రియేట్ చేయాలి అంటూ విష్ చేయడం జరిగింది. భారతీయ సినిమా ప్రపంచ స్థాయిలో ఇక తగ్గేదే లే అంటూ చెప్పుకొచ్చింది. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం లో శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం :