బుక్ మై షో లో బిగ్గెస్ట్ రికార్డ్ సెట్ చేసిన “పుష్ప”.!

Published on Dec 25, 2021 8:02 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తన మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ సినిమా “పుష్ప ది రైజ్”. పాన్ ఇండియన్ లెవెల్లో మంచి అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం రికార్డు బ్రేకింగ్ వసూళ్లను మొదటి రోజు నుంచి కూడా రాబడుతూ మొదటి వారం పూర్తి చేసుకుంది. మరి ఈ సినిమా సెన్సేషన్ మరి బిగ్గెస్ట్ రికార్డు ని సెట్ చేసినట్టుగా మేకర్స్ తెలుపుతున్నారు.

ప్రముఖ భారతదేశ ఆన్లైన్ టికెట్ బుకింగ్ సంస్థ అయినటువంటి బుక్ మై షో నుంచి కేవలం 8 రోజుల్లోనే ఏకంగా 3.5 మిలియన్ టికెట్లు బుక్ అయ్యాయట. అంటే ఓన్లీ బుక్ మై షో నుంచే 35 లక్షలకు పైగా టికెట్లు తెగినట్టు వారు చెప్తున్నారు. మరి ఇది ఈ ఏడాది ఏ ఇండియన్ సినిమాకు కూడా దక్కని ఘనత అని వారు తెలిపారు. మొత్తానికి మాత్రం పుష్ప రాజ్ పాన్ ఇండియన్ లెవెల్లో మోత గట్టిగానే మోగిస్తున్నాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం :