మరొక రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప!

Published on Jan 4, 2022 12:37 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా సంయుక్తం గా నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడం జరిగింది. ఈ చిత్రం ఇప్పుడు మరొక రికార్డ్ ను క్రియేట్ చేయడం జరిగింది.

పుష్ప ది రైజ్ చిత్రం ను బుక్ మై షో ద్వారా ఇప్పటి వరకూ 5 మిలియన్స్ కి పైగా చూసినట్లు తెలుస్తుంది. 5 మిలియన్ కి పైగా టికెట్స్ సోల్డ్ అయినట్లు తాజాగా చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. 2021 వ సంవత్సరం లో ఇదే హయ్యెస్ట్ అని తెలుస్తోంది. రష్మీక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో సమంత స్పెషల్ సాంగ్ లో నటించడం జరిగింది. ఈ చిత్రం లో సునీల్, అనసూయ భరద్వాజ్, ఫాహద్ ఫజిల్, ధనంజయ, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం కి సంబంధించిన రెండవ పార్ట్ పుష్ప ది రూల్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :