ప్రమోషన్స్ బిజీలో “పుష్పరాజ్”.. నేడు ఎక్కడెక్కడంటే?

Published on Dec 15, 2021 2:02 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “పుష్ప”. పాన్‌ ఇండియన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌నున్నారు. మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో డిసెంబర్ 17వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి.

ఇందులో భాగంగానే నేడు “పుష్పరాజ్” ఉదయం బెంగళూరు, అనంతరం సాయంత్రం కొచ్చి, రేపు ముంబైలో పుష్ప ప్రమోషన్ చేయనున్నారు. ఇకపోతే మలయాళ నటుడు ఫాహద్ ఈ చిత్రంలో విలన్ పాత్ర లో నటిస్తున్నారు. ఈ చిత్రం లో సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :