మెగా హీరో సినిమాలో రాశి ఖన్నా !
Published on Apr 26, 2017 8:33 am IST


ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన రాశి ఖన్నా ఎన్టీఆర్ సరసన ‘జై లవ కుశ’ నటిస్తూనే మాస్ మహా రాజ్ రవితేజ్ తో కలిసి ‘టచ్ చేసి చూడు’ చిత్రంలో కూడా నటిస్తోంది. అంతేగాక తాజాగా ఈమెకు మరో మంచి ఆఫర్ దక్కినట్టు తెలుస్తోంది. అది కూడా మెగా హీరో సినిమాలో కావడం విశేషం. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ‘ఫిదా’ సినిమాలో నటిస్తున్న వరుణ్ తేజ్ అది పూర్తవగానే నూతన దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఒక ప్రాజెక్ట్ చేయనున్నారు.

అందులో హీరోయిన్ గా రాశి ఖన్నాను సెలెక్ట్ చేసినట్టు సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీతం దర్శకుడు ఎస్. ఎస్ థమన్ సంగీతం అందించనుండగా సినిమా ఎప్పుడు ఆరంభమవుతుంది, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 
Like us on Facebook