మెగాహీరో సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకేంద్రుడు !
Published on Sep 18, 2017 6:00 pm IST


మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం బివిఎస్ రవి దర్శకత్వంలో ‘జవాన్’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సినిమా జరుగుతున్న సెట్స్ ను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సందర్శించారు. యూనిట్ తో సరదాగా కాసేపు ముచ్చటించారు. అంతేగాక సినిమాలో ప్రముఖ తారాగణంపై ఒక షాట్ ను సైతం డైరెక్ట్ చేశారు.

అలా దర్శకేంద్రుడు సెట్స్ కు రావడం, సరదాగా మాట్లాడటం, దర్శకత్వం కూడా చేయడంతో హీరోధారం తేజ్ తో పాటు, హీరోయిన్ మెహ్రీన్ కౌర్, దర్శకుడు బివిఎస్ రవి కూడా చాలా ఆనందపడ్డారు. అయన సెట్స్ కు రావడం తమకు చాలా గౌరవంగా భావిస్తున్నామని కూడా అన్నారు. కుటుంబానికి, దేశంపై భక్తికి మధ్య నలిగిపోయే యువకుడి కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశకు చేరుకుంది. టీజర్, పాటతో పాజిటివ్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

 
Like us on Facebook