ప్రభాస్ ప్రీమియర్ కి కదిలి రావడం జరగదు – రాజమౌళి

Published on Mar 18, 2022 12:02 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే మన టాలీవుడ్ లో ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఇతర హీరోల అభిమానుల్లోనే కాకుండా టాలీవుడ్ లో మోస్ట్ ఆఫ్ సెలెబ్రెటీ లు కూడా ప్రభాస్ వ్యక్తిత్వాన్ని ఇష్టపడతారు. అలాంటి ప్రభాస్ కి అత్యంత సన్నిహితంగా ఉండే దర్శకుల్లో ఒకరైన దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా “రౌద్రం రణం రుధిరం” చిత్రం ప్రమోషన్స్ లో ఇంట్రెస్టింగ్ మాటలు రాజమౌళి మరియు చరణ్, తారక్ ల మధ్య నడిచాయి.

అయితే మధ్యలో RRR ప్రీమియర్స్ కోసం రాజమౌళిని తారక్ ప్రభాస్ ని పిలుద్దామా అని అడుగుతాడు. దానికి రాజమౌళి ఇచ్చిన సమాధానం మంచి వైరల్ గా మారింది. ప్రభాస్ ఒక ప్రీమియర్ కోసం కదిలి రావడం జరిగే పని కాదని అనగా నువ్ కాకపోతే చరణ్ పిలుస్తాడు, లేకపోతే మేమిద్దరం పిలుస్తాం అని అంటే రాజమౌళి లేదు అవేమీ జరగవు ప్రభాస్ రాడు అంటూ వారికి ఇచ్చిన ఫన్నీ ఆన్సర్ క్లిప్ ఇపుడు ఈ అందరి అభిమానుల్లో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :