అభిమానుల అంచనాలను అందుకున్న రాజమౌళి

Published on Mar 26, 2020 12:00 am IST

రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టైటిల్ ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే భారీతనం, గంభీరత్వం ఉట్టిపడేలా ఉంది టైటిల్. ఇక ఫ్యాన్స్ విషయానికొస్తే చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు స్టార్లను జక్కన్న సమాన రీతిలో ఎలా చూపుతారో చూడాలని మొదటి నుండి ఆసక్తిగా ఉన్నారు. వారికి చిన్న శాంపిల్ అనేలా ఉంది విడుదలైన మోషన్ పోస్టర్.

అల్లూరి సీతారామరాజు పాత్రలోని రామ్ చరణ్ ను రౌద్రానికి ప్రతీకగా నిప్పుతో పోల్చిన రాజమౌళి ఎన్టీఆర్ ను రుధిరం అంటూ నీటితో పోల్చారు. ఈ రెండు శక్తులు కలిస్తే రణంలో గొప్ప శక్తి పుడుతుంది అనే అర్థం వచ్చేలా మోషన్ పోస్టర్ రూపొందించారు. ఇది చూశాక కథలో ఇద్దరు హీరోలు ఒకరకి ఒకరు ఏమాత్రం తగ్గరని రూఢీ అయిపోయింది. అంతేకాదు చరణ్, తారక్ లాంటి ఇద్దరు స్టార్లు కలిస్తే ఆన్ స్క్రీన్ మీద ఎంతటి భీభత్సం జరుగుతుందో హింట్ కూడా ఇచ్చారు. సో.. అభిమానులు, ప్రేక్షకులు జనవరి 8న ‘రౌద్రం రణం రుధిరం’ అనే భీభత్సాన్ని వీక్షించడానికి సిద్దంకావొచ్చు.

సంబంధిత సమాచారం :

X
More