“RRR” కోసం స్పెషల్ గెస్ట్ గా రాజమౌళి గట్టి ప్లాన్?

“RRR” కోసం స్పెషల్ గెస్ట్ గా రాజమౌళి గట్టి ప్లాన్?

Published on Nov 21, 2021 10:02 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు పాన్ ఇండియన్ లెవెల్లో ఉన్న ఈ చిత్రం ఇప్పుడు కీలక అప్డేట్స్ మరియు అదిరే ప్రమోషన్స్ కి సన్నద్ధం అవుతుంది. మరి అందులో భాగంగా రాజమౌళి గట్టి ప్లానింగ్ లే వేస్తున్నట్టు తెలుస్తుంది.

అందులో భాగంగా ఇటీవల రాజమౌళి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ని మీట్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి సల్మాన్ ని ఈ చిత్రం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానం చేయనున్నాడట. ఆల్రెడీ దుబాయ్ లో ఈ ఈవెంట్ ని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాని కోసమే ఈ చిత్ర యూనిట్ సల్మాన్ ని పిలవనున్నారట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు