మెడికల్ చెకప్ కోసం యూఎస్ వెళ్లిన రజనీ !


సూపర్ స్టార్ రజనీకాంత్ మెడికల్ చెకప్ కోసం యూఎస్ వెళ్లారనే విషయం బయటకు రాగానే అభిమానుల్లో కాస్త కంగారు మొదలైంది. అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలని అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రజనీ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ‘కాలా’ షూటింగ్లో ఉన్న అయన నిన్న రాత్రి కుమార్తె ఐశ్వర్యంతో కలిసి యూఎస్ వెళ్లారట.

అయితే ఇందులో కంగారు పడాల్సిందేమీ లేదని, రజనీ రెగ్యులర్ చెకప్ కోసమే యూఎస్ వెళ్లారని అన్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని జూలై మధ్య నాటికి ఆయన ఇండియా వచ్చి తిరిగి ‘కాలా’ షూటింగ్లో పాల్గొంటారని కూడా తెలుస్తోంది. పా.రంజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ స్థాయి అంచనాలున్నాయి. మరోవైపు శంకర్ డైరెక్షన్లో ఆయన చేసిన ‘రోబో-2’ ప్రమోషన్లను హాలీవుడ్ నుండి మొదలుపెట్టారు నిర్మాతలు.